Pawan Kalyan concentrates on Kapu communityజనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ తన సుడిగాలి పర్యటన పూర్తి చేసుకున్నారు. గతంలోకి భిన్నంగా ఈసారి కులాల ప్రస్తావన ఎక్కువగా తీసుకొచ్చారు. తాను కులాలకు అతీతం అని చెప్పుకుంటూనే కాపులను ఆకట్టుకునే ప్రయత్నం చేసారని నిపుణులు భావిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల ను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

కాపులకు విందు భోజనం పెడతామని ఆకు నాకించారని ఆయన వ్యాఖ్యానించారు. కాపులకు ఇచ్చినట్టుగా 5% రిజర్వేషన్లు కాకుండా 15% ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. నిన్నటి విజయవాడ మీటింగ్ లో కులరహిత సమాజం అంటూనే వంగవీటి మోహన రంగ హత్యను ఖండించడంతో కాపులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారనే చెప్పుకోవాలి.

వంగవీటి మోహన్ రంగ పేరు పవన్ కళ్యాణ్ పలకగానే అక్కడి జనం నుండి వచ్చిన రెస్పాన్స్ బట్టే పవన్ కళ్యాణ్ బలం ఎక్కడ ఉందొ తెలుస్తుంది. కాపు ఐకాన్ గా కీర్తించబడే తన అన్నయ్య చిరంజీవిని ప్రజారాజ్యం విషయంలో వెనకేసుకొని వచ్ఛే ప్రయత్నం కూడా ఇందులో భాగమే కావొచ్చు. కులాల ప్రాధాన్యత ఎక్కువగా ఉండే ఆంధ్ర రాజకీయాల్లో కులాన్ని విస్మరించడం కష్టం కూడా.

ఒక వర్గం అయితే చంద్రబాబు కాపు రేజర్వేషన్లు ప్రకటించిన వెంటనే తన ఓటు బ్యాంకు కాపాడుకొవడానికే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారని అంటున్నారు కూడా. పవన్ కళ్యాణ్ తననుతాను కులరహితుడిని అని చెప్పుకోవడం వల్ల గాని నిజానికి ఎవరు వారి ఓటు బ్యాంకును కాపాడుకోవాలి అనుకోరు.