వైసీపీ సర్కార్ ఇంగిత జ్ఞానం ఉందా?వరద బీభత్సం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఈ వరద బీభత్సం సామాన్యుడి బ్రతుకు పైన తీవ్ర ప్రభావమే చూపించింది. హృదయ విదారకమైన సంఘటనలు మీడియా వేదికలుగా ప్రజల కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో సమయంలో ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా “అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా” అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఓ పక్కన రాష్ట్రాన్ని వరద కకావికలం చేస్తున్న వైనాన్ని ఫొటోలతో సహా పోస్ట్ చేస్తూ, మరోవైపు ఇసుక అమ్ముకోవడానికి పేపర్లలో ప్రభుత్వం ఇచ్చిన పబ్లిసిటీ తీరును ఎండకట్టారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ ట్వీట్స్ ను జనసైనికులు వైరల్ చేస్తున్నారు.