Pawan Kalyan satire onnandamuri balakrishnaజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరిలో తన పోరాట యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వమే టార్గెట్ గా ఫిరంగులు ఎక్కు పెడుతున్నారు. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో తన సహచరుడు, హిందూపూర్ ఎమ్మెల్యే, చంద్రబాబునాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది.

తాను బాలకృష్ణలా ప్రధానిని దూషించలేను అని, సంస్కారహీనంగా మాట్లాడలేను అని పవన్ కళ్యాణ్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. బాలక్రిష్ణ మోడీని తిడితే ఎవ్వరూ డిబేట్ పెట్టరెందుకు అని? ఆయన మీడియా మీద కూడా విసుర్లు విసురుతున్నారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ అనుభవరాహిత్యంగా కనిపిస్తుంది.

పదే పదే బాలకృష్ణ నరేంద్రమోడీని దూషించారు అని చెబితే అయన మోడీనే తిట్టిన మొగాడు అని.. పవన్ కళ్యాణ్ కనీసం మోడీని ప్రశ్నించలేని స్థితిలో ఉండి మోడీని తిడితే కూడా తట్టుకోలేకపోతున్నారు అనే మెస్సేజ్ ప్రజలలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. పైగా ఈరోజు రేపు రాజకీయాలలో బూతులు తిట్టే రాజకీయ నాయకులను హీరోలుగా చూస్తున్నారు (బాలకృష్ణ ప్రధానిని అన్న మాటను తప్పుగా అర్ధం చేసుకున్నారని టీడీపీ వారు అంటారు అది వేరే విషయం). మోడీకి పవన్ కళ్యాణ్ కు ఏమన్నా చీకటి ఒప్పందం ఉందా అనే అనుమానాలు రావొచ్చు. కావున పవన్ కళ్యాణ్ ఆ విషయం అక్కడితో వదిలేస్తే మంచిది.