Pawan Kalyan comments on Chandrababu Naidu in Chennaiజనసేన అధినేత ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో ఆయనకే తెలీదు. ఆయన ఉన్నఫళంగా చెన్నై వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి దేశానికీ రెండో రాజధాని దక్షిణాదిన రావాల్సిన అవసరం ఎంతో ఉందని దీనికోసం అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి వారి మద్దతు కూడగట్టి అందరిని ఒక తాటి మీదకు తేవడానికి తాను సిద్ధమని పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో వ్యతిరేక ఫలితాలకు భయపడి జనసేన పోటీ నుండి తప్పించుకుంది.

ఆ రాష్ట్రంలో జనసేన ఏ పార్టీకు మద్దతు ఇవ్వడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఎలా ముందుకు వెళ్ళాలి అనేదాని మీద ఇప్పటిదాకా పవన్ ఎటువంటి మాట చెప్పలేదు. కనీసం తెలంగాణకు ఏ పార్టీ మంచిదో కూడా చెప్పలేని స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ మొత్తంగా దక్షిణాదికే మార్గదర్శనం చేస్తారంట. పార్టీ పెట్టిన నాలుగున్నర సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వచ్చిన ఎన్నో వివాదాలపై కనీసం ఎప్పుడూ పవన్ కళ్యాణ్ స్పందించారు.

పరస్పరం ఎన్నో విరుద్ధమైన వివాదాలు ఉన్న దక్షిణాది రాష్ట్రాల మధ్య సయోధ్య తెస్తారా ఆయన? గత కొద్దీ రోజులుగా బీజేపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీల నేతలను కలిసి వారి మద్దతు కూడగడుతున్నారు చంద్రబాబు. కేంద్రంపై పోరాటంలో టీడీపీ ఒక మెట్టు ఎక్కువగా ఉన్నట్టు దీని వల్ల కనిపిస్తుంది. దీనితో కేంద్రానికి వ్యతిరేకంగా దక్షిణాదిన రెండో రాజధాని అంటూ పవన్ కళ్యాణ్ బయటకు రావడం గమనార్షం. దీనిలోని కనికట్టు ఏంటో కనిపెట్టడం పెద్దగా కష్టం కాదు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చెన్నై వెళ్ళి చంద్రబాబు రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నారు. యన ఎప్పుడు స్నేహితుడుగా ఉంటారో.. ఎప్పుడు ప్రత్యర్థిగా మారతారో చెప్పడం కష్టమని.. ఆయనతో ప్రయాణం ప్రమాదకరమని మిగతా పార్టీలకు హెచ్చరిక జారీ చేసారు. మహాకూటమి ఏర్పాటులో చంద్రబాబు ప్రయత్నాలు సత్ఫలితాలు అందివ్వవన్న పవన్.. జాతీయ రాజకీయాల్లో మూడో కూటమి అవసరమని కుండబద్ధలు కొట్టారు. గతంలో ఇటువంటి ప్రయత్నమే ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ చేసి చేతులు కాలకా సైలెంట్ అయిపోయారు. చూడాలి పవన్ కళ్యాణ్ ప్రయత్నం ఏమవుతుందో?