పవన్ కళ్యాణ్ ముందుంది నడిపించకపోతే పని కాదు

pawan kalyan comments 0n ysr congress వైఎస్సార్ కాంగ్రెస్ కు బలంగా మద్దతునిచ్చిన వర్గాలలో యువత ఒకటి. అయితే ఇటీవలే విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కారణంగా ఆ వర్గంలో ప్రభుత్వం మీద ఆగ్రహం పెల్లుబిక్కింది. ఆ అంశం మీద ప్రభుత్వాన్నిఇరుకున పెట్టడానికి టీడీపీ ప్రయత్నించింది.

అయితే మొదట్లో బానే మొదలుపెట్టినా క్షేత్ర స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చెయ్యలేకపోయింది. దానితో ప్రభుత్వం ఆ అంశాన్ని సైడ్ ట్రాక్ చెయ్యగలిగింది. ఈ విషయంలో ఇప్పుడు ఆలస్యంగా మేల్కొని జనసేన హడావిడికి రెడీ అవుతుంది.

దీనిపై ఆ పార్టీ వినతిపత్రాల ఉద్యమం చేయబోతోంది. జాబ్ కాలెండర్ తో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని… దీనికి నిరసనగా జనసేన పార్టీ ఈ నెల ఇరవైన ఉపాదికల్పన అధికారులకు వినతిపత్రాలు ఇస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలకు ప్రకటన ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత విస్మరించిందని… ప్రభుత్వం ఇవ్వదు అలాగే ప్రైవేటు పరిశ్రమలలో కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఆలస్యంగానైనా మేల్కోవడం మంచిదే అయితే జనసేన ఈ విషయంలో ప్రభావం చూపించగలదా అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ తన పాటికి తాను షూటింగులు చేసుకుంటూ బిజీగా ఉంటే క్షేత్రస్థాయిలో నాయకులు, క్యాడర్ ఏ మాత్రం ప్రభావం చూపించలేరు. వారు ఏదైనా ప్రయత్నించినా కనీసం మీడియా కవేరేజ్ కూడా ఉండదు. పవన్ కళ్యాణ్ ముందుండి నడిపిస్తేనే ఉపయోగం.

Follow @mirchi9 for more User Comments
Dosti Music RRR - HemaChandra, MM Keeravaani -Jr NTR-Ram Charan-RajamouliDon't MissRRR Song – Thematic Yet Appealing With Goosebumps EndingThe first song, Dosti, of the most awaited movie of the year RRR, is out....Sankranthi 2022 Dates - Here's The Biggest Gainers And LosersDon't MissSankranthi 2022 Dates - Here's The Biggest Gainers And LosersThe Sankranthi 2022 biggies’ dates are out with the announcement of the release date of...Prashant Kishor - YS JaganDon't MissPrashant Kishor Pushes Jagan Into A FixA Newspaper report has carried that Political strategist Prashant Kishor has met YSR Congress MP...Ishq: Not A Love Story Movie ReviewDon't MissIshq: Not A Love Story Review - A Terrible RemakeBOTTOM LINE A Terrible Remake OUR RATING 2/5 CENSOR 'U/A', 1h 55m What Is the...Don't MissThimmarusu Review - Over-Smart, Yet Watchable!BOTTOM LINE Over-Smart, Yet Watchable OUR RATING 2.75/5 CENSOR 'U/A' What Is the Film About?...
Mirchi9