awan Kalyan - Chiranjeevi-తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రతి నెల మొదటి వారంలో అంతకు ముందు నెలలో తన వద్ద నమోదైన టైటిల్స్ ని ప్రకటిస్తుంది. ఈ నెల ప్రకటించిన మూడు టైటిల్స్ లో మూడు పెద్ద సినిమాల టైటిల్స్ అయ్యి ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. ముందుగా దిల్ రాజు సంస్థ వకీల్ సాబ్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేసింది.

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ సినిమాగా బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన పింక్ ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక లాయర్ గా కనిపించబోతున్నారు. దీనితో ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ పెట్టి ఉంటారని అంతా అనుకుంటున్నారు. ఛాంబర్ లో రెజిస్టరైన మరో టైటిల్ – ఆచార్య.

చిరంజీవి – కొరటాల సినిమాని నిర్మిస్తున్న సంస్థలలో ఒకటైన మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ ఈ టైటిల్ ని రిజిస్టర్ చేసింది. గతంలో వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం చిరంజీవి ఈ సినిమాలో గోవింద ఆచార్య అనే పాత్రలో కనిపించబోతున్నారు. దీనితో ఈ సినిమా టైటిల్ ‘ఆచార్య’ గా ఉండవచ్చని అందరు అనుకుంటున్నారు.

ఇక చివరి టైటిల్ ‘ఓ డియర్… రాధే శ్యామ్’ ని యూవీ క్రియేషన్స్ సంస్థ రిజిస్టర్ చేసింది. బహుశా ఇది ప్రభాస్ సినిమాకు అయ్యి ఉండవచ్చు. మొదట్లో దీనికి జాన్ అనుకున్నారు అయితే జాను అని 96 రీమేక్ కి పెట్టడంతో జాన్ బదులు ఓ డియర్ అని పెట్టి ఉండవచ్చు. రాధే శ్యామ్ అనేది క్యాప్షన్ కావొచ్చు. మొత్తానికి అలా మూడు పెద్ద సినిమాల టైటిల్స్ చెప్పినట్టు అయ్యింది.