pawan-kalyan-chiranjeevi-diwali-celebration-selfieదీపావళి నాడు మెగా ఫ్యామిలీ అంతా కలిసి సంబరాలు చేసుకున్న ఫోటో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో మెగా హీరోలందరూ కలిసి ఉన్న ఈ ఫోటో అభిమానులకు కన్నుల విందుగా మారింది. అయితే అందరూ ఉన్నా ఒక్క పవన్ కళ్యాణ్ లేరన్న ఫీలింగ్ అభిమానుల మదిని తలచివేస్తోంది. అయితే ఇలాంటి పండగలు, పబ్బాలు అంటే పవన్ కళ్యాణ్ కు అయిష్టం అన్న విషయం అభిమానులకు తెలిసినదే. ముఖ్యంగా డబ్బులను టపాసుల రూపంలో వృధాగా ఖర్చు పెట్టడం అంటే పవన్ కు అస్సలు ఇష్టం లేని వ్యవహారం.

అయితే పవన్ లేరన్న అనుభూతిని పొందిన ఓ అభిమాని, ఆ లోటు భర్తీ చేసేందుకు చేసిన ప్రయత్నమే ఈ ఫోటో. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ ఉండటమే కాదు, ఏకంగా పవన్ కళ్యాణే సెల్ఫీ తీసినట్లుగా తన క్రియేటివిటీని ప్రదర్శించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇంకేముంది… మెగా అభిమానులకు కావలసిన పవన్ కళ్యాణ్ కూడా ఈ ఫోటోలో ఉండడంతో అది కాస్త అసలు ఫోటోను మించిపోయే రేంజ్ లో వైరల్ అయ్యింది. ‘అసలు’ కంటే ‘వడ్డీ’ ముద్దంటే ఇదేనేమో..!

అసలు (మొదటి) ఫోటో చూడని కొందరు అభిమానులైతే, నిజంగా పవన్ కళ్యాణ్ సెల్ఫీ తీశారా… అని ఆశ్చర్యపోయే విధంగా ఈ ఫోటో ఆకట్టుకుంటోంది. అయితే తొలి ఫోటోను చూసిన ఫ్యాన్స్ మాత్రం ఈ ఫోటోను ఎడిటింగ్ చేసిన వాళ్లకు అవార్డు ఇవ్వాల్సిందేనని తెగ మెచ్చుకుంటున్నారు. మెగా హీరోలందరి కలయికలో పవన్ లేని లోటును అభిమానులు అలా ఫీలవుతున్నారు మరి! ఏది ఏమైతేనేం… పవన్ నిజంగా లేకపోయినా… ఉన్నట్లు సృష్టించిన ఈ ఫోటోను చూసుకుని పండగ చేసుకుంటున్నారు.