Pawan Kalyan Jr NTR‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ – ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ ల కాంభినేషన్ లో తెరకెక్కనున్న సినిమా సోమవారం నాడు హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారనే టాక్ తో కావల్సినంత పబ్లిసిటీ ఇప్పటికే జరిగిపోయింది. అయితే లేటెస్ట్ ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం ఒక్క పవన్ కళ్యాణే కాదు, మరో బడా స్టార్ హీరో కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయనున్నారని తెలుస్తోంది.

త్రివిక్రమ్ తో ఎలా అయితే పవన్ కు సత్సంబంధాలు ఉన్నాయో, విక్టరీ వెంకటేష్ కు కూడా అదే స్థాయిలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ – త్రివిక్రమ్ కాంబో ఎలాగో, రచయితగా ఉన్న కాలంలో వెంకీ – త్రివిక్రమ్ ల కాంబో కూడా అదే మాదిరి ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికీ వీరిద్దరి మధ్య అదే సాన్నిహిత్యం ఉన్న విషయం పలు సినీ వేడుకల ద్వారా స్పష్టమైంది. దీంతో ఈ అనుబంధంతోనే విక్టరీ వెంకటేష్ కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు విచ్చేయనున్నారని సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ తరపున అన్న నందమూరి కళ్యాణ్ రామ్ మరియు హరికృష్ణ హాజరు కానుండగా, త్రివిక్రమ్ తరపున పవన్ కళ్యాణ్ మరియు విక్టరీ వెంకటేష్ లు అతిధులుగా విచ్చేయనుండడంతో ఈ సినిమాపై హంగామా అప్పుడే ప్రారంభమైంది. ఈ సమాచారం తెలుసుకున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తూ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు. మొత్తానికి జూనియర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన కాంబో అదిరిపోయే రీతిలో ప్రారంభం కాబోతోందన్న మాట.

Official: Pawan Kalyan To Launch NTR28