పవన్ కళ్యాణ్.. చంద్రబాబు.. గ్రేట్ టైమింగ్ ఇటీవలే వచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. అయితే ఎన్నికలు జరిగిన తీరు, టీడీపీ బహిష్కరణతో ఈ ఫలితాలు ఏమీ ఎవరికీ ఆశ్చర్యంగా అయితే లేదు.

అయితే ఈ ఫలితాల బట్టి తెలిసింది ఏంటంటే.. టీడీపీ, జనసేన మధ్య దూరం తగ్గుతూ వస్తుంది. తూర్పు గోదావరిలో నాలుగు ఎంపీపీలు, పశ్చిమ గోదావరిలో రెండు ఎంపీపీలు ఆ రెండు పార్టీలు కలిసి పని చేసి కైవసం చేసుకున్నాయి.

అధికారంలో ఉన్న పార్టీని తట్టుకుని రెండు ప్రతిపక్ష పార్టీలు ఎంపీపీలు గెలవడమంటే సామాన్యమైన విషయం కాదు. అదే సమయంలో జనసేన, టీడీపీ పొత్తు వైపు నడుస్తున్నాయని సంకేతాలు కూడా వెలువడ్డాయి.

2014 ఎన్నికలలో కలిసి పని చేసిన రెండు పార్టీలు అకారణంగా విడిపోయాయి. పవన్ కళ్యాణ్ ఎందుకు రివర్స్ అయ్యాడో తెలియదు గానీ ఆయన టీడీపీ మీద చేసిన వ్యాఖ్యలు ఇరు పార్టీల కార్యకర్తల మధ్యా చాలా దూరం పెరిగిపోయింది.

ఒకరినొకరు చిరకాల శత్రువుల్లాగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో ఇద్దరూ కలిశారు సరే క్యాడర్ కలుస్తుందా అనేది అసలు ప్రశ్న. అయితే ఒకవేళ పొత్తు పెట్టుకోవడం అనేది నిజమైతే దానిని ఎన్నికల ముందు వరకు వాయిదా వెయ్యకుండా ఇప్పుడే ఒక హింట్ వదలడం మంచి ఆలోచన.

ఈ రెండున్నర సంవత్సరాలలో ఆ అగాధాన్ని చాలా వరకూ తగ్గించే అవకాశం ఉంది. ఆ అగాధం ఎంత తగ్గితే అంతగా ఓట్లలోకి మార్చుకోవచ్చు.