Pawan-Kalyan-Bus-Yatra---Jana-Sena-Chandrababu-Naidu-TDPనిన్న రాత్రి పవన్ కళ్యాణ్ బస చేస్తున్న ఒక కల్యాణ మండపంలో విద్యుత్ ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత బౌన్సర్లకు ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను కలవాలని ప్రయత్నించిన వారిని ఆపడం మొదలైన గొడవ రెండు వర్గాలు బాహాబాహీకి దిగడం వరకు వెళ్ళింది. ఆయన ఎలా బయటికి రారో చూస్తామంటూ విద్యుత్తు సరఫరాను సిబ్బంది నిలిపేశారు.

అయితే ఇది ప్రభుత్వ కుట్ర అని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. “ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను కిరాయి గూండాలని పంపించి నిన్న రాత్రి పలాసలో నేను ఉంటున్న ప్రాంతంలో కరెంట్ తీసేసి దాడి చేసేకి ప్రయత్నించారు మీ నాయకులు, నేను అన్నిటికి తెగించిన వ్యక్తిని . ఇలాంటి తప్పుడు సంకేతాలకి తప్పుడు వేషాలకి భయపడే వాడు కాదు,” అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

అయితే పవన్ కళ్యాణ్ ప్రతిరోజు ప్రభుత్వంపై ఏదో ఆరోపణ చేసి మీడియా, ప్రజల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన చేస్తున్న ఆరోపణలకు తమ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ‘జనసేన పోరాట యాత్ర’ ప్రస్తుతం టెక్కలిలో జరుగుతుంది.