Pawan Kalyan, Pawan Kalyan Boyapati Movie, Power Star Pawan Kalyan Boyapati Movie, Pawan Kalyan Director Boyapati Movie, Pawan Kalyan Boyapati Srinu Movieపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ వర్ధమాన దర్శకులకే అవకాశం ఇస్తారు తప్ప, టాప్ స్థానంలో ఉన్న దర్శకులతో పని చేసింది చాలా తక్కువ. ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ ను మినహాయిస్తే… పవన్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒకటి, రెండు సినిమాలు చేసి ఆఫర్ల కోసం వేచిచూసే దర్శకులకే అవకాశం ఇస్తున్నారు తప్ప, టాప్ దర్శకులను మాత్రం తన సినిమాలకు ఎంపిక చేసుకోవడం లేదు. దీనికి గల కారణాలు కూడా అందరికీ తెలిసినవే, ఇండస్ట్రీలో బహిర్గతమే.

కానీ, తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్త సంచలనాత్మకమైంది. లెజండరీ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు బ్యానర్ లో పవన్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం దర్శకుల వేటలో ఉన్న దాసరి, చివరికి బోయపాటి శ్రీనుకు ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. ఒక మాస్ పవర్ ఫుల్ సబ్జెక్ట్ ను ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా కూడా సినీ జనాలు చెప్పుకుంటున్నారు.

ఈ వార్తలలో వాస్తవం ఎంత ఉందో గానీ, ఇది కార్యరూపం దాలిస్తే… పవర్ స్టార్ అభిమానులకు అసలైన పండగ అని చెప్పవచ్చు. ఇప్పటికే మెగా హీరో అల్లు అర్జున్ కు “సరైనోడు” రూపంలో బ్రేక్ ఇచ్చిన బోయపాటి, త్వరలో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాకు కూడా దర్శకత్వం వహించబోతున్నారని ప్రచారం జరిగింది. ఇంతలో లేటెస్ట్ గా పవన్ వచ్చి చేరడంతో… మెగా క్యాంప్ లో బోయపాటి సెటిల్ అయ్యారని, త్వరలోనే మిగిలిన మెగా హీరోలను కూడా ఒక రౌండ్ వేసుకుని, అప్పుడు బయటకు వస్తారని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.