Pawan Kalyan -BJP-Tirupati By Electionsతిరుపతిలో బలిజ సామజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో బీజేపీ నాయకులంతా పవన్ కళ్యాణ్ భజన మొదలుపెట్టారు. 2019 ఎన్నికలలో ఆరో స్థానం లో సరిపెట్టుకున్న బీజేపీ ఈ సారి జనసేన మద్దతుతో గౌరవప్రదమైన ఓట్లు సాధించాలని ఆరాటపడుతుంది. దానితో పవన్ ని ప్రసన్నం చేసుకోవడానికి తాము ఆయనను ఏపీలో అధిపతిని చేస్తామని ప్రకటించారు.

దానికి పవన్ కళ్యాణ్ కరిగిపోయి ఏప్రిల్ 3న తిరుపతి ప్రచారానికి వెళ్తున్నారు. పాదయాత్రతో పాటు ఒక భారీ బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు పవన్ కళ్యాణ్. అయితే బీజేపీని నమ్మలేం అని జనసైనికులే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి బీజేపీకి బలం లేదు కాబట్టే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అని చెప్పేది.

ఒక్కసారి బీజేపీ బలపడితే తెలంగాణలో జనసేన ని తరిమెసినట్టు తరిమేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో అసలు బలం లేని బీజేపీ పవన్ కళ్యాణ్ ను సీఎంని చెయ్యడమేంటి? రాజకీయాలలో ఓట్ల బలం లేనోడ్ని ఎవ్వడూ పట్టించుకోడు, జనసేన దీని మీద దృష్టి పెట్టి జాగ్రత్త తీసుకోకపోతే బీజేపీ మింగేయడం ఖాయం.

పొత్తుల సంగతి పక్కన పెట్టి పార్టీ బలం పెంచుకోవడం పై పవన్ దృష్టి పెట్టుకోవాలి. అవకాశం ఉన్న ప్రతీ చోటా జనసేన పోటీ చెయ్యాలి. ఎన్నికలలో పోటీ చేస్తేనే పార్టీ శ్రేణులు సంఘటితం అవుతాయి. అప్పుడే పార్టీ బలం పెరుగుతుందని జనసేన పార్టీ అభిమానులు పవన్ కు చెబుతున్నారు.