Pawan Kalyan BJP Bhajanaజనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో ఘోర పరాజయం పొందారు. ఆయన పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలవడంతో పాటు ఆయన పోటీ చేసిన రెండు సీట్లలోను ఓడిపోయారు. దీనితో రాజకీయ మనుగడ కోసం బీజేపీతో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ నుండి ఏమైందో ఏమో గానీ ఆయన బీజేపీ భజన మొదలు పెట్టారు.

ట్విట్టర్ లో జనసేన విషయాల కంటే కూడా… బీజేపీ లోని చిన్నా పెద్దా నాయకుల ట్వీట్లు రీ-ట్వీట్లు చెయ్యడం, బీజేపీ ఎజెండాను మొయ్యడం పవన్ కళ్యాణ్ కు నిత్యకృత్యం అయిపోయింది. కొన్ని విషయాలలో బీజేపీ నాయకులకంటే కూడా ఆయన అత్యుత్సాహం చూపించడం అభిమానులకు కూడా చికాకు రప్పిస్తుంది.

ఈ క్రమంలో జనసేన పూర్తిగా నష్టపోతుందని వారు భయపడుతున్నారు. ఈ క్రమంలో నిన్న వచ్చిన ఒక వార్త ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మద్రాస్ హై కోర్టు తమిళనాడులో మద్యం షాపులను మూయమని ఆదేశించింది. యథేచ్ఛగా సాంఘిక దూరం పాటించకపోవడంతో హై కోర్టు ఈ దిశగా ఆదేశాలు ఇచ్చింది.

ఈ పిటిషన్ వేసిన ఇద్దరిలో కమల్ హస్సన్ పార్టీ ఒకటి. కమల్ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికలలో ఘోరపరాజయం పొందింది. అయినా సరే కమల్ రాజకీయంగా యాక్టీవ్ గా ఉన్నారు. ఇటువంటి ప్రజాపయోగ పనులు చేస్తే ప్రజా మద్దతు కూడగట్టాలి గానీ మోడీ.. అమిత్ షాల భజన చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదని సొంత అభిమానులే పవన్ కు చెబుతున్నారు.