ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో జరుగుతున్న పొలిటికల్ సమరంలో చిక్కుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమా విడుదలపై నెలకొన్న సందేహాలను పటాపంచలు చేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. దీంతో సమరానికి సై అన్న రీతిలో పవర్ స్టార్ సిద్ధమయ్యారని అర్ధమవుతోంది.
విడుదలపై ‘భీమ్లా నాయక్’ తీసుకున్న ఈ నిర్ణయంతో టికెట్ల పెంపుపై ఆశలు పెట్టుకున్న ‘ఆర్ఆర్ఆర్’ అండ్ ‘రాధే శ్యామ్’ సినిమాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. పవన్ తీసుకున్న ఈ డెసిషన్ పరోక్షంగా బాల్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోర్ట్ లోకి తోసినట్లయ్యింది.
Also Read – ఓ గబ్బర్ సింగ్, ఓ పుష్పరాజ్.. మరిచిపోలేని పాత్రలే!
ఒకవేళ టికెట్ల పెంపును ఆపినట్లయితే పవన్ సినిమా కోసమే జగన్ టికెట్ ధరలను పెంచలేదని ప్రత్యక్షంగా సినీ ప్రేక్షకుల్లోకి, ప్రజల్లోకి వెళుతుంది. టికెట్ ధరలు పెరిగితే, అన్ని సినిమాలతో పాటు ‘భీమ్లా నాయక్’ కూడా లబ్ది పొందుతుంది. దీంతో సంకట స్థితిలోకి జగన్ ను తోశారన్న టాక్ బలంగా వినపడుతోంది.