pawan kalyan bheemla nayak mass posterమరో వారం రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సృష్టించబోతున్న ప్రభంజనం కోసం అభిమానులంతా ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ఓపెనింగ్స్ లో సరికొత్త రికార్డులకు వేదిక అవుతుందని భావిస్తున్న “భీమ్లా నాయక్” సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా ఓ మాస్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ సెన్సార్ సర్టిఫికెట్ ‘యు/ఎ’గా ధృవీకరించారు. బుల్లెట్ పై దుమ్ము లేపుతూ ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్ కు కావాల్సినంత కిక్ ను పంచుతోంది. చూడబోతుంటే మరో “గబ్బర్ సింగ్” మాదిరి ఫ్యాన్స్ స్టఫ్ అంతా నిండిపోయి ఉన్నట్లుగా “భీమ్లా నాయక్” కనపడుతున్నాడు.

ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఇసుమంత కూడా కనిపించడం లేదు గానీ, ‘గబ్బర్ సింగ్’లో వాడిన ‘కటౌట్ ఉన్నోడికి కంటెంట్ తో పనిలేదన్న’ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది. మరికొద్ది గంటల్లో ట్రైలర్ విడుదల కానున్న తరుణంలో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

145 నిముషాల రన్ టైం కలిగిన “భీమ్లా నాయక్” సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ యుఎస్ లో ప్రారంభం అయ్యాయి. ఈ బుకింగ్స్ తీరు ఒక్కటి చాలు… ఈ మాస్ ఎంటర్ టైనర్ పై సినీ ప్రేక్షకులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో అని చెప్పడానికి! యుఎస్ ప్రీమియర్స్ 1 మిలియన్ డాలర్స్ దాటి వసూలు చేస్తుందన్న అంచనాలు ట్రేడ్ వర్గాలలో నెలకొంది.