Pawan kalyan Balakrishnaబాప్ అఫ్ ఆల్ ఎపిసోడ్స్ గా ఆహా ఘనంగా ప్రమోషన్ చేసుకున్న బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ల అన్ స్టాపబుల్ రెండో మరియు చివరి భాగం ఇవాళ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. గంటన్నర నిడివితో దాదాపు ఒక ఇంగ్లీష్ మూవీ లెన్త్ తో ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రభాస్ టైంలో లాగా ఈసారి యాప్ క్రాష్ కావడం లాంటివేవీ జరగలేదు కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు బాలయ్య అభిమానులు దీని కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. కారణం సినిమాల గురించి కంటే రాజకీయాలకు సంబంధించిన డిస్కషనే ఎక్కువనే క్లారిటీ ముందే ఇవ్వడం వల్ల పరస్పరం అదే బాండింగ్ కొనసాగించిన ఈ ఇద్దరూ ఈసారి సీరియస్ ఇష్యూస్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు.

అన్నయ్య చిరంజీవి నుంచి కష్టపడటం నేర్చుకున్నానని చెప్పిన పవన్ అదే సమయంలో మొహమాటం ముఖస్తుతి వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చూసి దాన్ని మాత్రం తీసుకోలేదని ఓపెన్ అయ్యాడు. అభిమానుల ప్రేమ ఓట్లుగా ఎందుకు మారడం లేదన్న ప్రశ్నకు ఓవర్ నైట్ ఎవరూ ఉన్నత స్థాయికి చేరుకోరని ట్రాన్స్ ఫర్ మేషన్ కు కొంత సమయం అవసరమవుతుంది కాబట్టి దాని కోసమే ఎదురు చూస్తున్నానని జనసేనాని వివరించాడు. ఇరుకున పెట్టే ప్రభుత్వాలకు బుద్దిచెప్పాల్సిందేనని నొక్కి వక్కాణించడమూ ఇందులో ఉంది.

వైజాగ్ లో అధికార పార్టీ తనను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు, 1983లో తెలుగుదే దేశం పార్టీ పెట్టినప్పటి ఎన్టీఆర్ ఐడియాలజీకి ఇప్పటి జనసేనకు ఉన్న సారూప్యతలు, అప్పట్లో నందమూరి తారకరామారావు తీసుకొచ్చిన సంక్షేమ మంత్రం ఇప్పటికీ అందరూ పాటిస్తున్నారని ప్రస్తావించడం, రామ్ మనోహర్ లోహియా స్ఫూర్తి, ఇప్పటం నుంచి వచ్చిన వృద్ధురాలు పవన్ చేసిన సాయం గురించి భావోద్వేగంతో చెప్పడం, నీ సంకల్పం సిద్ధిస్తుందని పవన్ ని బాలయ్య ఆశీర్వదించడం, పుస్తకాలు చదువు పట్ల పవన్ కున్న దృక్పథం ఇలా మొత్తంగా ఎక్కువ ఈ అంశాల మీదే చర్చ కొనసాగింది.

హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ వచ్చాక కొంత వినోదాత్మకంగా సాగింది కానీ క్వశ్చన్స్ సెషన్ ని కాస్త ఎక్కువ లెన్త్ తో పెట్టేయడం వల్ల అది ల్యాగ్ అనిపించిన మాట వాస్తవం. ఇద్దరూ మల్టీ స్టారర్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు వచ్చిన ఫ్యాన్స్ మద్దతుతో పటు బాలయ్య పవన్ లు పరస్పరం సానుకూలంగా కనిపించడం ఏమో భవిష్యత్తులో నిజమైనా ఆశ్చర్యం లేదనిపించేలా సాగింది. నిడివిపరంగా ఎక్కువనిపించినా ఈ ఇద్దరు హీరోల అభిమానులు కోరుకున్నవి ఫేర్ వెల్ ఎపిసోడ్ లో దక్కాయి. న్యూట్రల్ గా చూసే వాళ్ళకు మాత్రం కాస్త ఓపికగా చూడాల్సిన సుదీర్ఘంగా సాగిన ఫీలింగ్ అయితే కలిగిస్తుంది.