pawan-kalyan-attends-koti-dhinostavam-karthika-masamతనకు సూటయ్యే పనులను మాత్రమే పవన్ చేస్తుంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తానూ చేయగలిగే పాత్రలు తప్ప, ఎంత గొప్ప పాత్రలు వచ్చినా నిర్మొహమాటంగా తిప్పి కొడతానని పలు సందర్భాలలో స్వయంగా పవన్ కళ్యాణే చెప్పారు. అలాగే తన అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్దని చెప్పినా గానీ, రాజకీయాల్లోకి వచ్చారు పవన్.

అలా తన మనస్సాక్షి చెప్పింది చేయడమే తప్ప, వేరేవారి మాట పవన్ కళ్యాణ్ వినడనే విషయం బహిరంగ సత్యమే. అలాంటి పవన్ ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చాడు. కార్తీక మాసంలో ప్రముఖ టెలివిజన్ నిర్వహించే ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమానికి హాజరైన పవన్, అక్కడ ఉన్న దేవుళ్ళ రూపాలను పరిశీలనగా చూస్తూ… కనిపించాడు. నిజానికి పవన్ ను ఇంతకుముందు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎవరూ చూసింది లేదు.

హైదరాబాద్ లో ఎంతో అట్టహాసంగా నిర్వహించే వినాయకచవితి వేడుకల్లో సైతం పవన్ ఒక్కసారి కూడా కనిపించిన దాఖలాలు లేవు. దీంతో పవన్ ఎంట్రీని చూసిన అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఇక్కడ కూడా పవన్ స్పెషాలిటీ ఏంటో చూపించారు. దైవ కార్యం కావడంతో పట్టుపంచె ధరించుకుని, నుదుట కుంకం పెట్టుకుని సాంప్రదాయంగా విచ్చేయడం, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పవన్ ఎంత విలువ ఇస్తున్నారో అర్ధమవుతుంది.