జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం పార్టీ శ్రేణులను ఉద్దేశించి విజయవాడలో ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పై స్పందించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన భార్యల గురించి చేసిన కామెంట్ల గురించి మరోసారి స్పందించారు ఆయన.
“నేను మట్టి కొట్టుకుపోతారు అంటే పవన్ కు సంస్కారం లేదు అన్నారు బొత్స గారు. ఏవో కారణాల వల్ల విడిపోయి వారి జీవితాలను సుఖంగా సాగిస్తున్న వారిని రాజకీయాలలోకి లాగడం ఎంతవరకు సమంజసం? వారిని తీసుకుని రాకూడదు అని ఇంగితజ్ఞానం మీ ముఖ్యమంత్రికి చెప్పండి ఆ విషయం,” పవన్ కళ్యాణ్ ఘాటుగా చెప్పుకొచ్చారు.
“ఇంగిత జ్ఞానం అంటే ఏదో తప్పు అనుకుంటారేమో. ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్. ఇంగ్లీష్ మీడియం చదువులు కదా మీకు ఇంగిత జ్ఞానం అంటే అర్ధం కాదు,” చురక అంటించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు కూడా మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
ప్రజా సమస్యల పై పవన్ లాంగ్ మార్చ్ చేస్తే మీరు పర్సనల్ గా కామెంట్స్ చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. “మీపై, మీ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోగలరా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు దీక్షకు జనసేన పార్టీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
Senior Actor Vexed With Pawan Kalyan!
Jagan Bhajana Batch Exposed!