Pawan-Kalyan---Jana-Sena---Mega-Fans-Meetఓ పక్కన పోరాట యాత్రలో బిజీగా జనసేన అధినేత ఒక్కసారిగా అమరావతిలో ప్రత్యక్షం కావడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందా? అంటే అవుననే సమాధానం టిడిపి వర్గీయుల నుండి లభిస్తోంది. దీని వెనుక చెప్తోన్న అంశం కూడా లాజికల్ గానే ఉండడంతో, ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది. అసలు విషయానికి వస్తే…

సోమవారం నుండి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతి గ్రామాల్లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. దాదాపుగా 3400 కోట్ల రుణం నిమిత్తం ఈ పర్యటన జరుగుతోంది. గత మూడు, నాలుగేళ్ళుగా అనేక మార్లు ఇప్పటికే వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు అమరావతి వచ్చి వెళ్లారు. దీంతో ఈ సారి పర్యటన తర్వాత నిధులు మంజూరు అవుతాయనే నమ్మకం అధికారులలో వ్యక్తమయ్యింది.

దీనిని ఎలాగైనా అడ్డుకోవడానికే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ నిధులు మంజూరు కాకుండా చూసే క్రమంలో ముందుగా ప్రజలను, అభిమానులను రెచ్చగొట్టేందుకు ఉన్నట్లుండి పవన్ అమరావతి పర్యటన చేసారనేది టిడిపి వర్గీయుల వాదన. దీని వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఉందని, ఆ కుట్రలో పవన్ భాగస్వామ్యుడు అయ్యాడనే దానిపై నిజానిజాలు ఎలా ఉన్నా, పవన్ చేసిన రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు, ప్రవర్తించిన విధానం మాత్రం ఈ ఆరోపణలకు బలం చేకూరేలా చేసింది.

రాజకీయాలు ఎవరిని ఎలా మార్చాస్తాయో తెలియదు అన్న దానికి నిదర్శనమే ఈ వార్తలు. ఈ కుట్ర నిజమో కాదో ఇప్పుడే చెప్పలేం గానీ, ప్రజాసేవ పేరుతో రాజకీయ నాయకులు ఎంత నీచానికైనా దిగజారుతారు అన్నది మాత్రం వాస్తవం. మరి ఈ ఆరోపణలపై జనసేన అధినేత మరియు జనసేన వర్గీయులు ఏ విధంగా సమర్ధించుకుంటారో చూడాలి.