పార్టీ పెట్టిన నాటి నుండి రాజకీయాలను పూర్తి స్థాయిలో పట్టించుకోవట్లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలలో మాత్రం వెనువెంటనే స్పందిస్తుంటారు. అలాగే చాలా పరిణితి చెందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ వివరణ ఉండడం గమనించదగ్గ అంశం.

తాజాగా నేడు ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటనను ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. మహిళలపై అసభ్యత జనసేన ఎన్నటికీ ఆహ్వానించదని, చంద్రబాబు కుటుంబంపై అధికార పక్షం చేసిన కామెంట్స్ శోచనీయమని, ఇది ప్రజలలో రాజకీయాలపై ఏహ్యభావనను కలిగిస్తాయని అన్నారు.

వ్యక్తిగత దూషణలకు మొదటి నుండి పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటారు. గతంలో పవన్ ముగ్గురి భార్యల అంశాన్ని లేవనెత్తుతూ జగన్ చేసిన కామెంట్స్ మరియు అందుకు పవన్ కళ్యాణ్ స్పందించిన వీడియోను ఈ సందర్భంగా జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.