Pawan Kalyan allegations on chandrababu naiduఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేనను చూసే భయపడి యువతను ఆకర్షించడం కోసం నిరుద్యోగ బృతి ప్రకటించారని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు యువత ఆకర్షితులువుతున్నందునే వారిని తిప్పుకునేందుకు చంద్రబాబు ఈ ప్రయత్నం చేశారని అయినా సఫలం కారని పవన్ అన్నారు.

ఆ నిరుద్యోగ భృతి కూడా అందరికీ కాదని, డిగ్రీ చదవితేనే యువకులుగా పరిగణిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటివి మోసం చేసే పథకాలు తప్ప నిజంగా యువతకు న్యాయం చేసే పథకాలు కావన్నారు. అయితే ప్రభుత్వ వాదన మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. పవన్ కళ్యాణ్ తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటున్నారని వారు ఎద్దేవా చేసారు.

“ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిరుద్యోగభృతికి మేము 1000 కోట్లు కేటాయించాము. అప్పటికి పవన్ కళ్యాణ్ మాతోనే ఉన్నారు. జూన్ నుండి పథకం అమలు చేస్తామని కూడా ప్రకటించాం. పవన్ కళ్యాణ్ ను చూసి భయపడుతున్నాం అనేది హాస్యపాదమే,” అని తెలుగు దేశం పార్టీ మంత్రి ఒకరు అన్నారు.

2014 తెలుగుదేశం మానిఫెస్టోలోనే నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించారు. అయితే రాష్ట్రం తీవ్ర నిధుల కొరతతో ఉండడం వల్ల దాని అమలు ఆలస్యం అయ్యిందని వారు అంటున్నారు. అయినా పవన్ కళ్యాణ్ అన్నదాంట్లో తప్పేమి లేదు. రాజకీయాల్లో ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవాల్సిందే.