Pawan Kalyan Agnyaathavaasi - Balakrishna Jai Simhaగత కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డుల విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆశించిన అవార్డులు రాని కొంత మంది బయటకు వచ్చి రచ్చ చెయ్యగా కొందరు లోపలే ఉండి వేరేవాళ్లతో రచ్చ చేయించారు. గుణశేఖర్, బన్నీ వాసు, పోసాని లాంటి వాళ్లైతే ఏపీలో కమ్మ రాజ్యం నడుస్తుందని, కమ్మ కులానికి చెందిన వారి కొమ్ము కాస్తుందని విమర్శించారు.

కొంత మంది అర్హులకు రాకపోవడంతో ఆ వాదనకు మీడియా కూడా కావాల్సినంత టైం ఇచ్చింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం అజ్ఞాతవాసి సినిమాకి భారీ నజరానా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల అవుతున్న అజ్ఞాతవాసి సినిమాను జనవరి 10 నుంచి 17 వరకు రోజూ రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 10 గంటల వరకు స్పెషల్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

దీనితో దాదాపుగా రోజుకు ఏడు షోలు ఆ చిత్రం ప్రదర్శించుకోవచ్చు. దీనితో భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే స్వయానా ముఖ్యమంత్రి బావ సినిమాకు పోటీగా వస్తున్న ఈ సినిమాకు ఇలాంటి బంపర్ ఆఫర్ ఇవ్వడంతో నందమూరి అభిమానులు సైతం నొచ్చుకుంటున్నారు.

మరోవైపు అప్పుడు కమ్మ రాజ్యం అని కూసిన నోళ్ళు ఇప్పుడు ఏమవుతాయో? పవన్ కళ్యాణ్ ది ఏ కులం? గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్న ఈ పర్మిషన్లు తరువాత కాపు రాజ్యం అవుతదా ఏపీ ప్రభుత్వం? అప్పుడు స్టూడియోలకు ఎక్కిన వాళ్ళు ఇప్పుడు వారి ఆరోపణలు వెనక్కు తీసుకుంటారా?