Pawan Kalyan Agnathavasi movie updatesత్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం, ప్రస్తుతం కర్ణాటక – చిక్ మంగుళూరు ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే యాక్షన్ సీన్ ను పవన్ తదితరులపై చిత్రీకరిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఈ ఫైట్స్ ను త్రివిక్రమ్ డిజైన్ చేయించినట్టు సమాచారం.

ఈ యాక్షన్ ఎపిసోడ్ ను చేస్తుండగా పవన్ చేతికి గాయమైనా ఆయన లెక్కచేయకుండగా షూటింగులో పాల్గొంటున్నాడని అంటున్నారు. ఇది పవన్ కి 25వ సినిమా .. త్రివిక్రమ్ – పవన్ కాంబినేషన్లో రానున్న మూడవ సినిమా. అందువలన త్రివిక్రమ్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడని చెబుతున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను విదేశాలలో ప్లాన్ చేశారు. కథానాయికలుగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.