Pawan Kalyan about criticism on brahmins in moviesపవర్ స్టార్ పవన్ కల్యాణ్! ఇప్పుడు ఆయన హీరో కాదు. ఆయన ఒక పొలిటికల్ లీడర్. ఒక పార్టీ అధినేత. అయితే 2019 ఎన్నికలకు రంగం సిద్దం చేసుకుంటున్న వేళ, పవన్ బస్ యాత్ర చేపట్టాడు. వివిధ వర్గాలతో భేటీ అవుతూ వారి సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. అయితే ఆయన ఏ నియోజకవర్గాల్లో ఈ యాత్ర చేస్తున్నారో ఎప్పటికప్పుడు జనసేన వర్గాలు మీడియాకి అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ యాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలో పవన్ మాట్లాడుతూ సినిమా రంగానికి సంభందించి బ్రాహ్మణ వర్గాన్ని కించపరుస్తూ ఉన్నారు అని. సినిమాల్లో వారిని చాలా తక్కువగా చేసి చూపిస్తూ ఉన్నారు అని ఆయన తెలిపారు. అదే క్రమంలో హిందువుల ఆత్మ గౌరవాన్ని కాపాడటంలో బీజేపీ ఓడిపోయింది అని పవన్ తెలిపారు. అంతేకాదు బ్రాహ్మణ వర్గానికి సినిమా వేదికగా జరుగుతున్న అన్యాయంపై ఆయన బాధ పడ్డారు.

అయితే ఇక్కడ అర్ధం కానీ విషయం ఏంటి అంటే, పవన్ దాదాపుగా 25 సినిమాల వరకూ తీశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నారు. ఆ క్రమంలోనే బ్రాహ్మణ వర్గానికి చెందిన కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. పచ్చిగా చెప్పాలి అంటే మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు సినిమాలో బ్రహ్మణులను కించ పరిచే విధంగా కొన్ని సీన్స్ ఉన్నాయి అని, అదే క్రమంలో ఎన్టీఆర్ అదుర్స్ లో కూడా ఇదే తరహా వ్యవహారం ఉంది అని కొన్ని గొడవలు జరిగాయి. అయితే అప్పుడు పవన్ అసలు వీటిపై స్పందిచిన ధాకలాలే లేవు. లేకపోగా ఆయన రాజకీయ నాయకుడిగా మారి తన పార్టీ 2019 ఎన్నికల బరిలో నిలవడంతో ఇప్పుడు బ్రాహ్మణులపై జరుగుతున్న ఈ విషయాలపై పోరాడతాను అని అంటున్నారు.

ఇదేం లెక్క? ఇదేం న్యాయం పవన్ గారు. పైగా హిందువుల ఆత్మాభిమానాన్ని బీజేపీ కాపాడలేకపోయింది అని అంటున్నారు. కొంపతీసి హిందువుల “సెల్ఫ్-రెస్పెక్ట్” పేటెంట్ రైట్స్ ఏమైనా భారతీయ జనతా పార్టీకి హిందువులు రాసిచ్చారా?. నిజంగా మీరు ఆరోజే బ్రాహ్మణుల విషయం జరిగిన సంఘటనలను ఖండించి ఉంటే మీపై గౌరవం మరింత రెట్టింపు అయ్యేది కదా. కానీ ఇప్పుడు చాలా లేట్ అయ్యింది. ఏది ఏమైనా మీరు కూడా ఒక రాజకీయ పార్టీ అధినేత లాగానే హామీలు గుప్పిస్తున్నారు తప్ప, ఒక ప్రజా అభిమానం కలిగిన వాడిలా కాదు అంటూ హర్ట్ అవుతూ ఉన్నారు ఆయన్ని అభిమానించే నాలాంటి ఎందరో అభిమానులు.