Pawan Hatao Politics Bachao‘జనసేన’ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు “కాంగ్రెస్ హటావో… దేష్ బచావో…” అయితే తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ ‘పవన్ కళ్యాణ్ హటావో… పాలిటిక్స్ బచావో…’ అన్న దాన్ని పాపులర్ చేసారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రచారంలోకి వచ్చిన బొగ్గుల శ్రీనివాస్ పుస్తకం నేడు విడుదలకు నోచుకుంటోంది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరగనున్న బుక్ ఫెయిర్ లో ‘పవన్ కళ్యాణ్ హటావో… పాలిటిక్స్ బచావో…’ అన్న పుస్తకం ప్రజలకు అందుబాటులోకి రానుంది.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాక ముందు నుండి ఆయన వ్యవహార తీరును, వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంఘటలను ఉదహరిస్తూ ఈ పుస్తకం రచించినట్లుగా రచయిత శ్రీనివాస్ చెప్పారు. సంచలన విషయాలతో కూడిన పవన్ జీవితంలోని విషయాలను ప్రస్తావించడంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న శ్రీనివాస్, “పవన్ అభిమానుల నుండి తనకు ముప్పు ఉందని” హోం మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి, తనకు సెక్యూరిటీ కావాలని విన్నవించుకున్నారు. విడుదలకు ముందు సంచలనాలు రేపుతున్న ఈ పుస్తకం విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలకు తెర లేపుతుందో చూడాలి.