Pawa kalyan - VV Vinayakదర్శకుడు వి.వి.వినాయక్ సీనయ్య అనే చిత్రంతో హీరోగా అరంగేట్రం చేయాల్సి ఉంది. షూటింగ్ మొదలుపెట్టాకా నిర్మాత దిల్ రాజు అది సరిగ్గా రావడం లేదని భావించడంతో ఈ చిత్రం మధ్యలోనే ఆపేశారు. అయితే వినాయక్ ఇప్పుడు మరో సారి మేకప్ వేసుకోబోతున్నారు అయితే ఇప్పుడు హీరోగా చెయ్యబోవడం లేదు.

అతను పవన్ కళ్యాణ్ మరియు రానా చిత్రంలో అతిధి పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రంలో ఆయన ఏ పాత్ర చేస్తున్నారు అనేది ఇంకా క్లారిటీ లేదు. వినాయక్ గతంలో చిరంజీవి నటించిన ఠాగూర్, ఖైదీ నెం 150 వంటి చిత్రాల్లో అతిధి పాత్ర పోషించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో చెయ్యబోతున్నాడు. ఈ చిత్రం మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనమ్ కోషియం యొక్క అధికారిక రీమేక్.

సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు అని అంటున్నారు అయితే ఇంకా ప్రకటన రాలేదు. ఈ ఏడాది రెండో భాగంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా. తమన్ సంగీత స్వరకర్త. అతను ఇప్పటికే పవన్ కళ్యాణ్ యొక్క వకీల్ సాబ్ కోసం సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ ఇంకా ఖరారు చేయలేదు.

అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి మెగాఫోన్‌ ను పట్టుకోనున్నారు. ఈ ఏడాది నితిన్ భీష్మతో పెద్ద హిట్ సాధించిన సీతారా ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తోంది. పవన్, రానాలు ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టారు. వారిద్దరి కాంబినేషన్ లో సీన్లు షూట్ చేస్తున్నారని సమాచారం.