Parliamentary panel sent notices  RBI governor Urjit Patel on Demonetizationదేశంలో పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ఈ నెల 20న హాజరై తెలియజేయాలని పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు నోటీసులు పంపించింది. డిసెంబర్ 30 తేదీతో జారీ అయిన నోటీసుల్లో రద్దు నిర్ణయం వెనుక ఆర్బీఐ పాత్రేమిటి? దేశ ఆర్థిక వ్యవస్థపై అది చూపిన ప్రభావం, రెండు నెలల్లో వచ్చిన మార్పు తదితరాలపై సమాధానాలను చెప్పాలని ఆదేశించింది.

సరైన ఆధారాలు చూపించకుంటే, అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టేనని భావిస్తూ, విధుల నుంచి ఎందుకు తొలగించరాదో స్పష్టం చేయాలని పేర్కొంది. రద్దు నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంకు తీసుకుందని, దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంటులో చెప్పిన మాటలు నిజమేనా? అని ప్రశ్నిస్తూ, ఒకవేళ ఇది రిజర్వ్ బ్యాంకు ఆలోచనే అయితే, నోట్ల రద్దుపై ఎప్పుడు చర్చించారని అడిగింది. ఈ అకస్మాత్ నిర్ణయం వెనక అసలైన కారణమేంటి? అని ప్రశ్నించింది.