Parakala-Prabhakar-has-expressed-concern-over-economic-slowdownఈ మధ్య ఎవరైనా దేశంలో ఆర్ధిక మాంద్యం ఉందంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఒంటికాలి మీద లేస్తున్నారు. అయితే ఆమెకు ఇప్పుడు ఇంటి పోరు మొదలయ్యింది. దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందని, వాస్తవాలను కేంద్రం అంగీకరించడం లేదని నిర్మలా సీతారామన్‌ భర్త నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పీవీ, మన్మోహన్‌ విధానాలే బాగా ఉండేవని పరకాల ప్రభాకర్‌ కొనియాడటం విశేషం. ఆయన పరోక్షంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడం విశేషం. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం కొన్ని ‘ఉద్దీపన’ చర్యలు ప్రకటించినా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. రాజకీయ అవసరాల కోసం మాత్రం అటువంటిది ఏమీ లేదని కేంద్రం వాదిస్తుంది.

ఇక నిర్మలా సీతారామన్ విషయానికి వస్తే దాదాపుగా ఆమె బడ్జెట్ లో చేసిన మార్పులన్నీ ఆ తరువాత సవరించాల్సి వచ్చింది. తాజాగా ప్రపంచ బ్యాంకు (డబ్ల్యుబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) భారత జీడీపీ వృద్ధి రేటు నేపాల్, బాంగ్లాదేశ్ కంటే తక్కువ ఉంటుందని చెప్పడం విశేషం.

పరకాల గత ప్రభుత్వంలో చంద్రబాబు మీడియా సలహాదారుగా ఉండేవారు. కేంద్రం ఏమీ చెయ్యడం లేదని, అయినా నిర్మలా సీతారామన్‌ భర్తకు కేబినెట్ హోదా ఇచ్చారని ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఆ తరువాత నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత ఏడాదిలో ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్య ఇదే.