Paper Boy Teaser Talkరొటీన్ మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి తెరకెక్కిస్తోన్న చిత్రం “పేపర్ బాయ్.” కొత్త నటీనటులు సంతోష్ శోబన్, రియా సుమన్ లు జంటగా నటిస్తోన్న ఈ సినిమా తొలి టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. హీరో ‘పేపర్ బాయ్’ ఏంటి? అని ఆశ్చర్యపడిన వాళ్ళకు ఈ టీజర్ సరైన సమాధానం ఇస్తుంది.

ఆహ్లాదకరమైన లొకేషన్స్ లో చిత్రీకరణ… వినసొంపైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్… చూడచక్కనైన సినిమాటోగ్రఫి… ఇలా ఈ పాజిటివ్ ఫీలింగ్ కలిగేలా ఈ టీజర్ నిలిచింది. అయితే హీరో వివరించిన ‘అయిదున్నర్ర అడుగుల సాంప్రదాయం… యాభై కిలోల తెలుగుదనం…’ అని చూపించిన హీరోయిన్ లుక్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉండడం విశేషం.

ముఖ్యంగా హీరోయిన్ ముఖకవళికలలో ఆ ‘తెలుగుదనం’ మిస్ కావడం ఒక్కటే టీజర్ లో లోపంగా చెప్పాలి. జయ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరో హీరోయిన్ గా తన్య హాప్ కూడా నటిస్తోంది. భీమ్స్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను సంపత్ నంది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసినట్లుగా కనపడుతోంది.