Pantham right now songటాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా గోపి సుందర్ తన మార్క్ ను వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ‘ఊపిరి, నిన్ను కోరి’ వంటి సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన గోపి సుందర్, తాజాగా గోపీచంద్ “పంతం” సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా లిరికల్ వీడియోలను రిలీజ్ చేస్తుండగా, లేటెస్ట్ గా ‘రైట్ రైట్’ అనే రెండవ పాటను యూ ట్యూబ్ లో రిలీజ్ చేసారు.

సితార కృష్ణకుమార్ ఆలపించిన ఈ పాటకు క్యాచీ ట్యూన్ అందించాడు గోపి. సంగీతంతో పాటు సాహిత్యం కూడా స్పష్టంగా వినిపించేలా ట్యూన్ ఇవ్వడంలో గోపి సిద్ధహస్తుడు. దీనికి భాస్కరభట్ల లిరిక్స్ తోడు కావడంతో, మొదటిసారే ఈ పాట వినసొంపుగా ఉంటుంది. గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జూలై 5వ తేదీన విడుదల కాబోతోంది. గోపీచంద్ కెరీర్ లో 25వ సినిమాగా ప్రతిష్టాత్మకతను సొంతం చేసుకుంది ఈ “పంతం.”