Pandem -Kodi 2 - Sandakozhi 2- Hello Guru Prema Kosameఈ ఏడాది దసరా పండగ సందర్భంగా రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి రామ్ “హలో గురు ప్రేమ కోసమే” సినిమా కాగా, మరొకటి విశాల్ తమిళ డబ్బింగ్ “పందెం కోడి 2” మూవీ. అసలు విషయం ఏమిటంటే… ఈ ఇద్దరు హీరోలకు ఖచ్చితంగా హిట్ బొమ్మ కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఎవరిని విజయం వరిస్తుందో లేక ఇద్దరికీ సక్సెస్ లభిస్తుందో అన్నది వేచిచూడాలి.

రామ్ హీరోగా నటించిన “హలో గురు ప్రేమ కోసమే” సినిమా క్లాస్ మూవీగా తెరకెక్కగా, విశాల్ “పందెం కోడి 2” ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంది. దీంతో ఈ పండగ ‘క్లాస్’ వర్సెస్ ‘మాస్’గా మారింది. నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ మూవీని దిల్ రాజు నిర్మించడం… పర్వాలేదనిపించే ట్రైలర్… జస్ట్ ఓకే అనిపించుకున్న సాంగ్స్… ఇలా కాస్త పాజిటివ్ వైబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే సెన్సార్ ముగిసిన తర్వాత సోషల్ అండ్ వెబ్ మీడియాలో ఈ సినిమాపై నెగటివ్ పబ్లిసిటీ పెద్ద ఎత్తున జరగగా, దానిని అధిగమించి సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. చిత్ర యూనిట్ మాత్రం సినిమా విజయంపై పూర్తి స్థాయి నమ్మకంతో ఉంది. మరి ఆ విజయం “హలో గురు ప్రేమ కోసమే” యూనిట్ కు దక్కాలని ఆశిద్దాం. ఇక విశాల్ “పందెం కోడి” తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలవడంతో, ఈ సీక్వెల్ పై అంచనాలు బాగానే ఉన్నాయి.

‘ఇది పక్కా మాస్ మూవీ’ అన్న విషయాన్ని ఈ సినిమా ట్రైలర్ స్పష్టం చేసింది. విశాల్ కు ఈ సినిమా విజయం చాలా కీలకం కానుంది. ఈ రెండు సినిమాలు ఇలా ఉంటే, ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ “అరవింద సమేత” రూపంలో ధియేటర్లలో సందడి చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఈ రెండు సినిమాల ప్రభావం తారక్ “అరవింద సమేత”పై పెద్దగా పడకపోవచ్చు, ఎందుకంటే ఇప్పటికే భారీ వసూళ్ళను యంగ్ టైగర్ కొల్లగొట్టేసాడు.