No Surprises from Telangana Congressతెలంగాణాలో తొలి దశలో 4479 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు నోటీసు ఇవ్వగా.. తొమ్మిది పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 769 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3701 పంచాయతీ సర్పంచి పదవులకు పోలింగ్‌ జరిగింది. ఎన్నికలలో విశేషం ఏమిటంటే 85.76 శాతం పోలింగ్‌ నమోదై పల్లెలలోని ఓటరు చైతన్యం కు అద్దం పట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 95.32 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి తక్కువగా..78.47 శాతం ఓట్లు పోలయ్యాయి.

మరోవైపు ఈ ఎన్నికలలో కూడా కారు తన జోరు చూపించింది. ఆ పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో విజయ ఢంకా మోగించారు. తొలి దశలో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా సగం పైగా అంటే తెరాస 2629 పంచాయితీలు గెలుచుకోవడం విశేషం. 902 స్థానాలతో కాంగ్రెస్ సరిపెట్టుకోగా.. మరే ఇతర పార్టీలు రెండంకెల స్థానాలు దాటలేకపోయాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెంటనే వచ్చిన ఈ ఎన్నికల మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏ మాత్రం దృష్టి పెట్టలేదు.

పైగా శ్రేణులు, నాయకులు పూర్తి స్థాయిలో నిరాశ నిస్పృహలలో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కు ఈ మాత్రం పంచాయతీలు వచ్చాయంటే గణనీయమైనవే కదా! ఈ రెండు పార్టీలు కాకుండా తెలుగు దేశం పార్టీ 31, భాజపా 67, సీపీఐ 19, సీపీఎం 32, ఇతరులు 758 చోట్ల విజయం సాధించారు. పలు కారణాల వల్ల 14 పంచాయతీల్లో ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఇంకో రెండు దశలలో ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో కూడా అధికార పార్టీనే పై చెయ్యి సాధించే అవకాశం ఉంది.