రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను జులై నెలలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఎన్నికల ప్రకటనలు(నోటిఫికేషన్లు) ప్రాంతాలవారీగా మూడు విడతల్లో మూడేసి రోజుల వ్యవధితో వెలువడుతాయి.
ప్రకటన వెలువడిన రోజు నుంచి 15వ రోజున పోలింగ్‌ను నిర్వహిస్తారు. అదే రోజున ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. ఈ క్రమంలో కొత్త పాలకవర్గాలు శిక్షణ లేకుండానే ఆగస్టు 1వ తేదీన కొలువు తీరనున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పంచాయతీ ఎన్నికలను తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తుంది.
అధికారంలో ఉండేవారికి అనుకూలంగా ఉంది ఈ ఎన్నికలు జరిపించి అత్యధిక సీట్లు గెలిచి 2019 ఎన్నికలు తమవే అనే సంకేతం పంపించే ప్రయత్నం చెయ్యబోతున్నట్టు సమాచారం. ఈ ఎన్నికలలో తెరాస ఘన విజయం సాధిస్తే ప్రతిపక్షాల ఆత్మ స్తైర్యం కూడా దెబ్బ తింటుందని పాలకపక్షం అంచనా.