palletooru-video-song-srinivasa-kalyanamమరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నితిన్ “శ్రీనివాస కళ్యాణం” నుండి ఓ వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేసారు. ఇటీవల రిలీజ్ చేసిన ఆడియో ఆల్బమ్ లో లేని ఈ పాటను పల్లెటూరు అందాలపై చిత్రీకరించారు. వేకువజామునుండి పల్లెటూర్లల్లో జరిగే కార్యక్రమాలపై చిత్రీకరించిన ఈ పాట రెగ్యులర్ మిక్కీ మ్యూజిక్ లానే ఉంది.

అంతేగాక సతీష్ వేగేశ్న ‘శతమానం భవతి’లో పల్లెటూరుపై ఆలపించిన పాటను గుర్తు చేస్తుంది. చిత్ర విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ అంతా తిరుమల చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. గతంలో దిల్ రాజు ‘బొమ్మరిల్లు’ ఆగష్టు 9వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలవడంతో, అదే తేదీన విడుదల కాబోతున్న ‘శ్రీనివాస కళ్యాణం’ ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో చూడాలి.