palle raghunath reddy satire on ys jagan mohan reddy‘ఈ సందర్భంగా జగన్ గారి గురించి వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మాటను సభ దృష్టికి తీసుకువస్తాను… “జగన్ లాంటి కొడుకు పగ వాడికి కూడా వద్దు” అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పడం ఈ రోజు నాకు అర్ధమవుతోంది’ అని అసెంబ్లీలో మంత్రి పల్లె రఘునాధరెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ వర్గాల నుండి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. ఆ తర్వాత కూడా వ్యాఖ్యానించిన పల్లె ప్రసంగం…

“తండ్రి తానూ పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని, తెలిసిన వాళ్లకు చెబితే ఏమైనా అర్ధమవుతుంది, అలాగే తెలియని వాళ్ళకు కూడా చెప్పొచ్చు, కానీ, తెలిసి తెలియని జగన్ లాంటి వారికి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. రాజధాని విషయంలో జగన్ ఎందుకు కపట ప్రేమ నటిస్తున్నారో చెప్పాలంటే… ఎప్పుడైతే లేపాక్షి భూములు 8,844 ఎకరాల భూములు వచ్చాయో ఆయనకు వాటా వచ్చింది, లబ్ది వచ్చింది సంతోషంగా ఒప్పుకున్నారు, అలాగే వాన్ పిక్ 25,000 ఎకరాలు వచ్చాయో, అందులో ఆయనకు వాటా, లబ్ది వచ్చింది సంతోషంగా ఒప్పుకున్నారు… కానీ 34,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారో, అపుడు ఆయనకు ఆగ్రహం, ఆవేదన వచ్చింది, అందుకని లేనిపోని ఆరోపణలు మంత్రులపై చేస్తున్నారు.”

“పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసుకుని 72 గదులలో జగన్ గృహం నిర్మించుకున్నారని, ఏ స్కూల్ పిల్లవాడిని అడిగినా… ఎత్తైన పర్వత శిఖరాలు ఏవంటే ఎవరెస్ట్ అంటారని, అత్యంత అవినీతి పరుడు ఎవరు అంటే జగన్ మోహన్ రెడ్డి అని చెప్తారని” తీవ్ర పదజాలంతో మండిపడ్డారు మంత్రి పల్లె రఘునాధరెడ్డి. న్యాయవ్యవస్థపై జగన్ చేసిన కామెంట్లను ఉపసంహరించుకోని నేపధ్యంలో పల్లె చేసిన వ్యాఖ్యలివి.