Pallam Raju as APPCC presidentగత ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఓటమికి బాధ్యత వహిస్తూ తన రాజీనామా లేఖ కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారట. ఫలితాలు కూడా రాకముందే రాజీనామా చెయ్యడం విశేషం. అధిష్టానమే ఓటమి భారంతో ఉండటంతో ఇప్పటివరకూ దాని మీద నిర్ణయం తీసుకోలేదు. ఇది ఇలా ఉండగా కేంద్ర మాజీ మంత్రి ఎమ్.ఎమ్.పల్లంరాజును నియమించారని వార్తలు వచ్చాయి. దీనిపై అదికారికంగా ప్రకటన రాలేదు కాని పల్లంరాజు నియామకం జరిగిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆయన మూడుసార్లు ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి పదవి నిర్వహించారు.ఆయన తాత పల్లంరాజు కూడా గతంలో పీసీసీ అధ్యక్షుడు గా ఉండేవారు. పల్లంరాజు పెద్దగా మాస్ లీడర్ కాకపోయినా గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు. పార్టీలో ఉంటారో ఉండరో తెలియని మాస్ లీడర్ల కంటే పార్టీకి విధేయుడిగా ఉండే వారే బెటర్ అని పార్టీ అధిష్టానం భావించిందట. వరుసగా రెండు ఎన్నికలలో ఖాతా కూడా తెరవలేదు. ఇటీవలే జరిగిన ఎన్నికలలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

ఈ తరుణంలో పార్టీ పగ్గాలు చేపట్టడమంటే సాహసమనే చెప్పుకోవాలి. కొద్ధి రోజుల క్రితం పల్లంరాజుకు ఈ పదవి ఆఫర్ చేసినా ఆయన సుముఖంగా లేరని వార్తలు వచ్చాయి. అధిష్ఠానం ఆయనను బలవంతంగా ఒప్పించి ఉండవచ్చు. మరోవైపు తాజా మాజీ పీసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి కొంత కాలం బ్రేక్ తీసుకుని ఆ తరువాత వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన వైఎస్ బ్రతికుండగా ఆయనకు వీరవిధేయుడు.