Pak-Actress-Singer-Reshma-Shot-Deadపాకిస్థాన్ కు చెందిన ప్రముఖ నటి, గాయకురాలు రేష్మ దారుణ హత్యకు గురి కాగా, ఆమె భర్తే తుపాకితో కాల్చి చంపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పాక్ లోని ఖైబర్ ఫక్తుఖ్వా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి నౌషేరా కలాన్ ప్రాంతంలోని హకిమాబాద్ ప్రాంతంలో తన సోదరుడితో ఆమె ఉంటుండగా, ఇంట్లోకి దూసుకొచ్చిన ఓ వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపి పారిపోయాడని ‘జియో టీవీ’ పేర్కొంది.

నిందితుడు ఆమె భర్తేనని, ఆయనకు రేష్మ నాలుగో భార్యని వెల్లడించింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రేష్మ భర్తను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సంవత్సరంలో పాకిస్థాన్ లో మహిళా కళాకారులను దారుణంగా హత్య చేసిన ఘటనల్లో ఇది 15వది. గాయనిగా మాత్రమే కాకుండా, పాకిస్థాన్ లో ఫేమస్ అయిన ‘జోబల్ గోలునా’ డ్రామాలో నటించీ రేష్మ తన అభిమానులను మెప్పించింది.