Paisa-Vasool-Teaser-Talk.jpgపవర్ ఫుల్ డైలాగ్స్ కు కేరాఫ్ అడ్రస్ బాలయ్య… వన్ లైన్ పంచ్ లకు మారు పేరు పూరీ… దీంతో ఎంతో ఆసక్తిని రేపిన వీరిద్దరి కాంభినేషన్ “పైసా వసూల్” తొలి టీజర్ వచ్చేసింది. పూరీ మార్క్ రొటీన్ మాస్ ఫార్ములాగా కనపడుతున్న ఈ టీజర్ కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను నిరాశపరచవచ్చు. అయితే పూరీ మార్క్ హీరోయిజంతో, డైలాగ్స్ తో ఈ టీజర్ ను ‘ఓకే’ అనిపించేలా చేయగలిగారు. పూరీ మార్క్ హీరోయిజానికి బాలయ్య ఎలా సెట్ అయ్యారు అని తెలుసుకోవడానికి ట్రైలర్ వరకు వేచిచూడాలేమో అన్న ఆలోచలను ఇచ్చింది ఈ టీజర్.

‘అన్నా… రెండు బాల్కనీ టికెట్లు కావాలి… సినిమా కాకపోతే ఇంకేంటి… ఐ యాం ది హీరో… యు ఆర్ ది కమెడియన్… అండ్ విలన్ టచ్ డ్ మై హీరోయిన్… దిస్ ఈజ్ యాన్ యాక్షన్ ఫిల్మ్…’ అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ మొత్తం యాక్షన్ పార్ట్ తోనే నిండిపోయింది. మధ్యలో… ‘తమ్ముడు… నేను జంగిల్ బుక్ సినిమా చూడలా… కానీ అందులో పులి నాలాగే చాలామంది చెప్పారు… అది నిజమో కాదు… మీరే చెప్పాలి,’ ‘మందేసిన మదపుటేనుగునిరా… క్రష్ ఎవ్రీ వన్..’ అనే డైలాగ్స్ తళుక్కుమంటాయి.

పూరీ డైలాగ్స్ గురించి కొత్తగా చెప్పాడనికేముంది, కానీ బాలయ్య స్వరంలోనే కాస్త మార్పు వినపడుతోంది. ‘ఫ్లో’లో ఎంతటి భారీ డైలాగ్స్ నైనా అవలీలగా చెప్పే బాలయ్య స్వరంలో ఆ ‘ఫ్లో’ తగ్గినట్లుగా కనపడుతోంది. ఇక లుక్స్ పరంగా స్టన్నింగ్ రేంజ్ కాకపోయినా ‘పర్వాలేదు’ అనిపించే విధంగా కనపడుతున్నారు. ఓ పక్కన డ్రగ్స్ కేసులో పూరీ పేరు బాగా వినపడుతున్న నేపధ్యంలో… పూరీ నుండి రాబోతున్న “పైసా వసూల్”పై అందరి చూపులు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ పూరీ కెరీర్ కు కూడా చాలా కీలకంగా మారింది.