శర్వానంద్ – సాయిపల్లవి జంటగా నటిస్తోన్న “పడిపడి లేచే మనసు” సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. పోస్టర్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్ జరగలేదు. చిత్ర యూనిట్ సభ్యులలో పుట్టినరోజులు వచ్చినపుడు మాత్రం పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నారు.
‘కృష్ణగాడి వీరప్రేమగాధ’తో సూపర్ హిట్ అందుకున్న ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి ‘లై’ సినిమాతో భంగపడ్డాడు. లవ్ స్టోరీలను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ గా పేరుగాంచిన హను, ఈ సారి ప్రయోగాలకు తావు లేకుండా శర్వా – సాయిలతో ప్రేమకధనే ఎంచుకున్నాడు. ఈ ఏడాదికి క్లైమాక్స్ ను ఘనంగా ఇచ్చేందుకు ఇయర్ ఎండింగ్ లో ముహూర్తాన్ని ఖరారు చేసుకుందన్న మాట.