Paagal - Viraata Parvamక్రాక్ విషయంగా నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మీడియా ముందుకు వచ్చి దిల్ రాజు మీద విరుచుకుపడ్డారు. క్రాక్ కు ఉద్దేశపూర్వకంగా థియేటర్లు ఇవ్వకుండా కిల్ చేస్తున్నాడని… నైజాం లో తాను ఒక్కడే ఉండాలని చేసే ప్రయత్నంలో భాగంగా మంచి సినిమాలకు నష్టం చేస్తున్నాడని… అదేంటని ప్రశ్నించిన నన్ను ఏకవచనంతో పిలిచి అవమానించాడని మీడియా ముందు చెప్పారు.

అసలు ఏమైందో దిల్ రాజు బయటకు వచ్చి చెప్పలేదు కానీ అందుకు ప్రతీకారంగా వరంగల్ శ్రీను పై దిల్ రాజు యుద్ధమే చేస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. విరాటపర్వం నైజాం రైట్స్ వరంగల్ శ్రీను దగ్గర ఉండటంతో ఆ సినిమా రిలీజ్ అయ్యే ఏప్రిల్ 30న పాగల్ సినిమా వేయించాడు దిల్ రాజు. మొన్న దిల్ రాజు మాజీ పార్టనర్ శిరీష్ టక్ జగదీష్ ఏపీ తెలంగాణ రైట్స్ పొందారు. అందుకోసమా అన్నట్టు నాగచైతన్య లవ్ స్టోరీ ఆ రోజు అనౌన్స్ చేయించారు.

అందులో కూడా దిల్ రాజు హస్తం ఉందట. కనీసం లవ్ స్టోరీ హీరో, డైరెక్టర్ కి తెలియకుండా ఆ ప్రకటన చేశారట. ఈ క్లాష్లు సహజంగానే జరిగేవీ పెట్టేవి కాదు. ఎవరో ఒకరు తప్పుకోవడం తప్పదు. కరోనా నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో క్లాష్ అనేది ఊహించడమే కష్టం.ఇటువంటి సమయంలో ఈ ఇగోల కారణంగా టాలీవుడ్ లో మంచి వాతావరణం ఉండటం లేదు.

పైగా హీరోల మధ్య స్పర్ధలు వచ్చేలా కూడా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఇరువైపుల పెద్దలు కూర్చుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించడం ఎంతో మంచిది. గతంలో ఇటువంటి పంచాయతీలు అన్నీ దాసరి వద్దకు చేరి పరిష్కారం అయ్యేవి. ఇప్పుడు అటువండి పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది.,