OTTs Platforms are playing with small fimsఒక నెల రోజుల క్రితం వరకు వెలిగిపోయిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నఫళంగా వెలవెలబోతోంది. కరోనా కేసులు ఎక్కువ కావడంతో థియేటర్లు మూతపడి ఇండస్ట్రీ అంతా ఆగిపోయింది. ఈ తరుణంలో చిన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు పరిస్థితి చక్కబడుతుందో తెలీదు. ఈ లోగా వడ్డీల రూపంలో రక్తం పీల్చేస్తున్నారు.

దానితో చాలా సినిమాలు థియేటర్ రిలీజ్ ప్రయత్నాలు మానుకుని ఇప్పుడు ఓటీటీ వైపు చుస్తున్నాయట. వీటిలో రెండు మూడు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయట. అయితే ఇదే అదనుగా భావించి ఓటీటీలు తక్కువకు బేరాలు ఆడుతున్నాయట. దీనితో నిర్మాతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు ఉందట.

ఇది ఇలా ఉండగా… ఓటీటీలు మాత్రం ఫస్ట్ వేవ్ లో ఇలాగే తాము ఎగిరి వీ, నిశ్శబ్దం వంటి సినిమాలతో నష్టపోయాం అని వాపోతున్నాయి. ఇప్పటి వరకు సెకండ్ వేవ్ లో అనసూయ నటించిన థాంక్ యూ బ్రదర్ మాత్రమే డైరెక్టుగా ఓటీటీలో విడుదల అయ్యింది. ఇక డైరెక్టు ఓటీటీ కు సంబంధించిన ప్రకటనలు ఏవీ కనిపించడం లేదు.

చిన్న సినిమాల పరిస్థితి ఇలా ఉంటే… పెద్ద సినిమాలు మాత్రం పెద్దగా వర్రీ అవ్వడం లేదట. థియేటర్లు ఓపెన్ కాగానే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వచ్చినట్టు ఆడియన్స్ థియేటర్లుకు పోటెత్తుతారని… దానితో తమకు వేరే ఆలోచన లేదని ఖచ్చితంగా చెబుతున్నారు. చూడాలి మునుముందు ఏం జరగబోతుందో!