other party leaders not interested to join Telangana bjpతెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రావడానికి ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. అయితే ఈ ముందస్తు ఎన్నికలు అనేవి బీజేపీ పార్టీకి ఏ మాత్రం ఉపయోగం లేనట్టుగా ఉన్నవి. ఆ పార్టీకి కనీసం 60 స్థానాల్లో పోటీ చెయ్యడానికి అభ్యర్థులు కూడా లేకపోవడం గమనార్హం.

తెరాసలో టిక్కెట్లు నిరాకరించిన నేతలు తమ వైపు చూస్తారని ఆ పార్టీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని బీజేపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారట. అయితే తన సీటుతో పాటు తనకు కావలసిన మహిళకు ఇంకో సీటు కంఫర్మ్ చేస్తే ఆలోచిస్తా అని చెప్పారంట ఆయన.

దీనితో బీజేపీ నేతలు సరే అన్నారట. అయితే రెండు సీట్లు ఇచ్చిన సరే ఆయన మళ్ళీ ఆలోచించుకుని చెప్తా అని చెప్పి మాయం అయిపోయారట. బీజేపీ గెలుపు మీద నమ్మకం లేకనే ఆయన ఆ పని చేశారని సమాచారం. పార్టీ నిండా మునిగినా కేసీఆర్ 2019 ఎన్నికలలో సాయం వస్తారనే ఆశతో బీజేపీ హై కమాండ్ ఆయనకు సహకరిస్తుందట.

ప్రస్తుతానికి కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతే చాలని మోడీ అమిత్ షా అనుకుంటున్నారట. అవసరమైతే రెండు మంత్రిపదవులు ఎర వేసి కేసీఆర్ ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవచ్చని వారి వ్యూహమట. దీనితో ఆ పార్టీ నేతలు, క్యాడర్ లో ఒక రకమైన నిర్లిప్తత ఆవహించిందట. ఇప్పుడు గత ఎన్నికలలో తెచ్చుకున్న సీట్లు నిలబెట్టుకోవడం కూడా కష్టమని వారే చెప్తున్నారు.