Osmania University Students dharna against bigg boss show at Nagarjuna Akkineni Houseబిగ్‌బాస్ షో రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో మూడో సీజన్ ఆదివారం నుండి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి సీజన్ ప్రశాంతగా ఆసక్తిగా కొనసాగినప్పటికీ, సీజన్ 2 మాత్రం కాస్త వివాదాస్పదమైంది. సీజన్ 2లో పక్షపాత వైఖరి ఎక్కువగా కనిపించిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎలాగైతేనేం రెండో సీజన్ హ్యాపీగానే ముగిసింది. అయితే బిగ్‌బాస్ 3 మాత్రం మొదలు కాకముందే రోజుకో వివాదం అన్నట్టు వార్తలలోకి ఎక్కింది.

ఇద్దరు యువతులు షో నిర్వాహకులు తమను వేధించారని ఆరోపించారు. వారికి మద్దతుగా ఈ షోను నిలిపివేయాలంటూ అక్కినేని నాగార్జున ఇంటిని ఓయూ విద్యార్థులు ముట్టడించారు. బిగ్‌బాస్ 3 వివాదంపై ఇద్దరు మహిళలు ఒంటరి పోరాటం చేస్తుంటే, నాగార్జున కనీసం స్పందించలేదని ఓయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మహిళలను కించపరిచే షోకి నాగార్జున ఏ రకంగా హోస్ట్‌గా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో మహిళలను కించపరిచే, వేధించే బిగ్‌బాస్ లాంటి షోలను వ్యతిరేకిస్తున్నట్టు ఓయూ విద్యార్థులు ప్రకటించారు. షో జరగాలంటే నిర్వాహకులు నుండి మహిళలకు ఎటువంటి హాని జరగదని నాగార్జున హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నాగార్జున కు సంబందించిన సినిమా స్టూడియోలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. దీనితో పోలీసులు భద్రతను మరింత పెంచారు. 15 మంది పాల్గొనే ఈ షో 100 రోజుల పాటు జరగబోతుంది.