Osmania General Hospitalఇటీవలే కాలంలో ఉస్మానియా ఆసుపత్రి దారుణమైన స్థితికి సంబంధించి తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆసుపత్రిలోని ఆరు బ్లాక్లు, రెండు ఆపరేషన్ థియేటర్లను ఉన్నఫళంగా మూసివెయ్యాలని ప్రభుత్వం తరపున డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తరువులు జారీ చేశారు.

ఇక్కడ ఇప్పటికే ఉన్న రోగులను వేరే బ్లాక్లకు ట్రాన్సఫర్ చెయ్యమని ఆదేశాలు ఇచ్చారు. అయితే మునుముందు ప్రభుత్వం ఏం చెయ్యబోతుంది అనేది చూడాలి. గతంలో ఇక్కడ ఉన్న భవనాలు కూల్చి అదే స్థానంలో అత్యాధునిక ఆసుపత్రి నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు.

అయితే వారసత్వ భవనాలు కూల్చకూడదని పలు నిరసనలు, కోర్టు కేసులతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తాజాగా ప్రభుత్వం పై విమర్శలు ఎక్కువ కావడంతో మళ్ళీ ఈ విషయంలో కదలిక వచ్చింది. ఆ భవనాలను అలాగే ఉంచేసి కొత్త చోట ఆసుపత్రి నిర్మిస్తే వివాదం పరిష్కరింపబడుతుంది.

మరి ప్రభుత్వ ఆలోచన ఎలా ఉందొ చూడాలి. అదే ప్రాంగ‌ణంలో ఖాళీ స్థ‌లంలో కానీ, న‌ర్సింగ్ హ‌స్ట‌ల్ వ‌ద్ద కానీ నిర్మించాల‌న్న ప్ర‌తిపాద‌న తెర‌పైకి వ‌స్తోంది. ఏదో ఒకటి తేల్చి అతితొందరలోనే కొత్త ఆసుపత్రికి కేసీఆర్ భూమి పూజ చేసి ప్రతిపక్షాలను ఆ విషయంలో సైలెంట్ చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.