opposition parties allegations on chandrababu naiduఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత గత సంవత్సరం మొదటి వరకూ ఎన్డీయేలో ఉన్నారు. మొదట్లో కేంద్రం తో సఖ్యతతో ఉండి కొన్ని కొన్ని సాధిస్తున్నానని అనేవారు, కేంద్రంతో గొడవ పెట్టుకుంటే జీవితం మరింత దుర్భరం అవుతుందని చెప్పే వారు. అయితే విపక్షాలు మాత్రం టీడీపీ ఒక పక్క కేంద్రంలోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ మరో పక్క మొసలి కన్నీరు కారుస్తున్నారు అని విమర్శించే వారు. చంద్రబాబు కేంద్రం నుండి బయటకు వచ్చే దాకా ఊరుకోలేదు.

చివరికి గత సంవత్సరం మార్చిలో ఎన్డీయే నుండి బయటకు వచ్చారు. కేంద్రంలోని బీజేపీ మీద కానీ వినీ ఎరుగని పోరాటం చేస్తున్నారు. బీజేపీని ఇరుకున పెట్టడానికి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్ తో కలిశారు. అవిశ్వాసతీర్మానం పెట్టారు. టీడీపీ బీజేపీ ఒకటే అని విపక్షాలు చేసిన గోబెల్స్ ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. దీనితో విపక్షాలు ప్లేటు మార్చాయి. ఇప్పుడేమో కేంద్రాన్ని విమర్శించడం ద్వారా ఆంద్రప్రదేశ్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తున్నారు.

కేంద్రంతో విబేధాలు వల్ల, ప్రధాని మోడీని మోసగాడని, కేంద్రం ఒక్క సైసా ఇవ్వలేదని, చెప్పడంతో కేంద్రానికి సహజంగానే మండి పడి ఆంధ్రప్రదేశ్ ను సాధిస్తుందట. గతంలో చంద్రబాబు ఎన్డీయే నుండి బయటకు రాలేదని గొడవ చేసిన వారే ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నారు అని ఆరోపించడం గమనార్హం. మోడీని వీరు అనే ధైర్యం చెయ్యలేరు. చేస్తే ఇప్పటిదాకా నెమ్మదిగా ఉన్న కేసులు ఫాస్ట్ ట్రాక్ అవుతాయి. అది వారి భయం. కాకపోతే దేనినో ఒక దానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబుని విమర్శించడం మాత్రం పరిపాటి.