Oopiri trailer disappointsకింగ్ నాగార్జున – తమిళ నటుడు కార్తి కాంభినేషన్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన “ఊపిరి” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను ఆడియో వేడుకపైన విడుదల చేయాల్సి ఉండగా, అప్పటికి సిద్ధం కాకపోవడంతో తాత్కలికంగా వాయిదా వేసారు. అయితే గురువారం నాడు అధికారికంగా ఒక చిన్న ఈవెంట్ ను ఏర్పాటు చేసి మరి విడుదల చేసిన “ఊపిరి” ట్రైలర్ ఇంకా యూ ట్యూబ్ ను తాకకపోవడంతో అక్కేనేని అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ పడ్డారు.

ఈ ధియేటిరికల్ ట్రైలర్ ను ఇప్పటికే వీక్షించిన కొందరు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ‘అద్భుతం… అమోఘం…’ అంటూ కితాబివ్వడంతో… ఎప్పుడెప్పుడు ఈ ట్రైలర్ ను వీక్షిద్దామా అని అక్కినేని అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎదురు చూసారు. అయితే గురువారం మధ్యాహ్న సమయం నుండి మరో గంట, మరో గంట అంటూ వాయిదా వేసిన చిత్ర యూనిట్, చివరికి 11వ తేదీన యూ ట్యూబ్ లో ల్యాండ్ అవుతుందని చెప్పారు.

కాస్త ఆలస్యమైనా అదిరిపోయే రేంజ్ లో వస్తామంటూ అక్కినేని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. టీజర్ ఇప్పటికే కన్నుల పండుగగా ఉండగా, ధియేటిరికల్ ట్రైలర్ అంతకు మించి ఉండడం ఖాయంగా కనపడుతోంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరి మదిలోకి… “ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడా?” అనే ఆలోచన కలగడం ఖాయం అంటున్నారు ఇప్పటికే వీక్షించిన ప్రముఖులు. దానికి సమాధానం అయితే మార్చి 25వ తేదీ!