oommen chandyకేంద్రం నుంచి నిధులు రాబట్టడంతో ఘోరంగా విఫలమైన చంద్రబాబు.. బొచ్చె పట్టుకుని విదేశాల్లో తిరుగుతున్నారని కొత్తగా నియమితులైన ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఉమన్ చాంది ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించారు.

ప్రత్యేక హోదాను నాలుగేళ్లు తొక్కిపెట్టిన టీడీపీ.. ఏన్డీఏ నుంచి బయటకు రాగానే ప్రత్యేక హోదా రాగం అందుకున్నదని చాంది అన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ లబ్ధి కోసమేనని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని చెప్పారు. అయితే చాందీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ వల్లే.

లోపభూయిష్టమైన బిల్లుతో ఏపీని అడ్డగోలుగా విభజించి రాష్ట్రం నడ్డి విరిచింది కాంగ్రెస్ కదా? కాంగ్రెస్ చేసిన పని వల్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్రం ముందు దేహీ అనాల్సి వచ్చింది. అదే విధంగా పెట్టుబడులు కోసం బొచ్చె పట్టుకుని విదేశాల్లో తిరగాల్సి వచ్చింది. కనీసం హోదా ను బిల్లులో కాంగ్రెస్ పెట్టి ఉంటే వారిని ప్రజలు నమ్మే వాళ్ళు.