Never-Tried-to-Use-Mahesh-Babu-&-His-Father---Sudheer-Babuసినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాలు మరో హీరో చేసి, అవి బాక్సాఫీస్ వద్ద సూపర్ కావడం అనేవి సర్వసాధారణం. ఇదే సమయంలో ఫ్లాప్ కూడా అవుతుంటాయి. అయితే ఫ్లాప్ అయినపుడు తమ నిర్ణయం సరైనదేనని, హిట్ అయినపుడు ఆ సినిమాను మిస్ అయిపోయామని భావించడం మానవ సహజం. ప్రస్తుతం అలాంటి ఓ ఉదంతాన్నే సుధీర్ బాబు తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

నాగశౌర్యతో అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన “ఊహలు గుసగుసలాడే” సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగశౌర్యకు ఒక బేస్ ఏర్పాటు చేసిన ఈ సినిమా నిజానికి సుధీర్ బాబు చేయాల్సినదట, అది కూడా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో! ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్ స్క్రిప్ట్ అందించగా, ఇంద్రగంటి దర్శకత్వంతో ప్రారంభమైన కొద్ది రోజులకే ఆగిపోయింది.

ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ చిన్న చిన్న మార్పులతో “ఊహలు గుసగుసలాడే” పేరుతో తెరకెక్కించారు. నాగశౌర్య – రాశి ఖన్నాలు జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలా ఓ మంచి సినిమా తన నుండి చేజారిపోయిందని చెప్పిన సుధీర్ బాబు, ఈ “సమ్మోహనం” మాత్రం ప్రేక్షకులను అలరిస్తుందని, నటుడిగా తనకు పేరు తీసుకువస్తుందని ఎంతో విశ్వాసంతో చెప్తున్నాడు.