Only Two States Favour of continuing The Lockdownకరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతున్న వేళ దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. లాక్ డౌన్ విధించిన తర్వాత నాలుగోసారి జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ లో కరోనా కట్టడి, లాక్ డౌన్ అమలు, ఆంక్షలపై చర్చించారు.

దేశంలోని రెండు రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు మే 3 తరువాత లాక్ డౌన్ సడలించాలనే కోరాయి. కేవలం హిమాచల్ ప్రదేశ్, మిజోరమ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే లాక్ డౌన్ మరింతగా పొడిగించాలని కోరుకున్నారు. కేవలం ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే వారు ఈ సిఫార్సు చేసినట్టుగా కనిపిస్తుంది.

అయితే మరోవైపు కేసులు తగ్గుతున్న సూచనలు కూడా లేవు. నిన్న కూడా దాదాపుగా 1400 కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో ఆర్ధిక ఇబ్బందుల గురించి లాక్ డౌన్ సడలిస్తే అది ఆత్మహత్యా సదృశ్యం కావొచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

దేశంలో ఇప్పటివరకు 27,892 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 872 మంది మృత్యువాతపడ్డారు. దేశంలోని నాలుగు చిన్న రాష్ట్రాలలో తప్ప అన్ని రాష్ట్రాలలోనూ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పొద్దున ఇచ్చిన మెడికల్ బులెటిన్ ప్రకారం 1,177 కేసులు, తెలంగాణాలో నిన్న రాత్రి వచ్చిన బులెటిన్ ప్రకారం 1,001 కేసులు ఉన్నాయి.