one india one elections in 2019దేశవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాలన్న ప్రతిపాదన అనుగుణంగా లా కమిషన్ ప్రతిపాదనలను సిద్దం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ముసాయిదా తయారు చేసి కమిషన్ ఈ నెల పదిహేడో తేదీన దీనిపై చర్చలకు సిద్ధం కాబోతుంది. దీని ప్రకారం 2019 లో లోక్ సభ ఎన్నికలతో పాటు 19 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిపే అవకాశం కనిపిస్తుంది.

ఇప్పటికి ఇలా కానిచ్చి మిగిలిన రాష్ట్రాలకు 2024 లో దేశం అంతటా ఒకే ఎన్నిక ఆచరణ సాద్యం అవుతుంది. అయితే 2019 ఎన్నికలలో ఒకేసారి ఎన్నికల వల్ల పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, జమ్ము కశ్మీర్ వంటి రాష్ట్రాలు తమ పూర్తి టరమ్ ను ఉండలేని పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వాలు తమ పదవీకాలాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది.

రెండో జాబితాలో ఉత్తరప్రదేశ్ ,ఉత్తరాఖండ్, పంజాబ్ ,కర్నాటక మొదలైన రాష్ట్రాలు ఉన్నాయి. ఈ జాబితాలోని రాష్ట్రాలు రెండున్నర ఏళ్లు అదనంగా పదవీకాలం పొందుతాయి.ఎపి, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఎటూ మొదటి జాబితాలోనే ఉంటాయి, అయితే దీనికి ఆయా పార్టీలు ప్రభుత్వాలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. అది ఏమంత తేలిక కాదు.